telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వర్మ “కరోనా వైరస్” ట్రైలర్

Corona

వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ రూపొందించిన “కరోనా వైరస్” ట్రైలర్ వచ్చేసింది. మంగళవారం సాయంత్రం కొత్త సినిమా ‘కరోనా వైరస్‌’ ట్రైలర్‌ను వర్మ రిలీజ్‌ చేశారు. మా పనిని ఆ దేవుడితో పాటు కరోనా కూడా ఆపలేదని నిరూపించుకోవాలనుకున్నామని ట్వీట్‌ చేశారు. లాక్‌డౌన్‌లో “కరోనా వైరస్”‌ పేరుతో ఫీచర్‌ ఫిల్మ్‌ చేసినట్లు వర్మ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే “కరోనా వైరస్”‌పై తీసిన తొలి చిత్రమిదేనని చెప్పారు. మా నటీనటులు, సాంకేతిక నిపుణులు తమ క్రియేటివిటీని నిరూపించుకున్నారు. లాక్‌డౌన్‌లోనూ వాళ్లు లాక్డ్ డౌన్ కాలేదన్నారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఒక ఫ్యామిలీలో కరోనా టైములో ఏం చేస్తుంది ? ఎలా స్పందిస్తుంది ? అనే కోణాల్లో సినిమా తెరకెక్కినట్టుగా అర్థమవుతోంది. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

Related posts