ఐపీఎల్ 2021 సీజన్‌ను యూఏఈ వేదికగా నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్- అక్టోబర్ మధ్య 25 రోజుల్లో లీగ్‌ను పూర్తి చేస్తామని తెలిపిన బోర్డు.. షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఇక ఇదే విషయాన్ని తెలియజేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ట్వీట్ చేసి సొంత అభిమానుల ఆగ్రహానికి గురైంది. ఐపీఎల్ 2021 రిటర్న్స్ అనే ఫొటోను ట్వీట్ చేయగా.. ఫ్యాన్స్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. యూఏఈ వేదికగా సన్‌రైజర్స్ ఆటగాళ్లు రాణించేది ఏం ఉండదని, ఉన్న పరువు కూడా పోతుందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఇక సెప్టెంబర్-అక్టోబర్ మధ్య రిస్టార్ట్ కానున్న ఐపీఎల్‌కు ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు దూరం కానున్నారు. ఈ విషయంపై ఎస్‌జీఎంలో చర్చించిన బీసీసీఐ.. ఓవర్‌సీస్ ఆటగాళ్ల గైర్హాజరీపై ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. వారు అందుబాటులో ఉన్నా లేకున్నా.. ప్లాన్ ప్రకారమే లీగ్ పూర్తవుతుందని స్పష్టం చేసింది. డేవిడ్ వార్నర్ అందుబాటులో ఉన్నా.. అతని సన్‌రైజర్స్ టీమ్‌మేనేజ్‌మెంట్ సారథిగా, ప్లేయర్‌గా కొనసాగించలేదని, కేన్ విలియమ్సన్, బెయిర్ స్టో గైర్హాజరీలో జట్టు ఏం రాణిస్తుందని ప్రశ్నిస్తున్నారు. త్రీడీ ప్లేయర్ విజయ్ శంకర్‌ను కెప్టెన్ చేయాలని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అలా కాకుంటే మనీష్ పాండేకు జట్టు బాధ్యతలు అప్పగించాలని కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి అభిమానుల మద్దతును సన్‌రైజర్స్ కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ ముందు స్టార్ ప్లేయర్లు అయిన విజయ్ శంకర్, కేదార్ జాదవ్, మనీశ్ పాండే గాయపడవద్దని, అందుకోసం సన్‌రైజర్స్ ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని ఎగతాళి చేస్తున్నారు. ఇంకొందరు అభిమానులైతే లీగ్ నుంచి తప్పుకోవడం ఉత్తమమని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు.
previous post
next post