ఈ నెల 23 నుంచి ప్రారంభించనున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో పాల్గొనాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. . పంచాయతీ సమ్మేళనంలో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… జిల్లాలోని ప్రతీ గ్రామం ఆదర్శ గ్రామంగా, స్వచ్ఛ, పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.
నూతన పంచాయతీ రాజ్ చట్టం రూపొందించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నిధులు, విధులు కేటాయించిందని తెలిపారు. గ్రామాలను ఆదర్శంగా తిర్చిదిద్దాలనే ప్రధాన ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా కలసికట్టుగా పని చేయాలని సూచించారు.