ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలీగఢ్ ప్రాంతంలో కాంగ్రెస్ నేతను దుండగులు దారుణంగా కాల్చిచంపారు. ఇద్దరు వ్యక్తులు బైకుపై శంషాద్‌కు సమీపంలోని కాంగ్రెస్ నేత మహ్మద్ ఫరూఖ్ ఆఫీసుకు వచ్చారు. ఇద్దరు మంగళవారం రాత్రి ఆఫీస్‌లోకి చొరబడి ఫరూఖ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఫరూఖ్‌కు తీవ్రగాయాలైనాయి.
వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తునారు. నిందితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆస్థి వివాదం వల్లే ఫరూఖ్‌ను హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
బీజేపీకి ఈసారి తీవ్ర పరాభవం: చంద్రబాబు