రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులివ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది. . శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఫెడరేషన్ రాష్ట్ర సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనిన్ నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని వారు తీవ్రంగా ఖండించారు.
అక్రెడిటేషన్ కార్డుల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారే పరిస్థితి ఉందన్నారు. జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
చంద్రయాన్-2 వైఫల్యంపై పాక్ మంత్రి అనుచిత వ్యాఖ్యలు