దేశంలో లాక్ డౌన్ ఎత్తివేత, చైనాతో సరిహద్దు ఘర్షణలు వంటి సమస్యలపై కేంద్రం రేపు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ అన్ని పార్టీలను కేంద్రం ఆహ్వానిస్తోంది. తాజాగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ సీఎం జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు.
అఖిలపక్షం ఉద్దేశాలను సీఎం జగన్ కు అమిత్ షా వెల్లడించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ కూడా సీఎం జగన్ తో మాట్లాడారు. కేంద్రమంత్రుల ఫోన్ అనంతరం రేపు జరిగే అఖిలపక్ష సమావేశానికి హాజరవ్వాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు. కాగా, రేపు సాయంత్రం జరిగే ఈ అఖిలపక్ష సమావేశాన్ని కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్నారు.
కేటీఆర్ ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ సీఎం కాలేడు: లక్ష్మణ్