telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

కరోనా నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం.. శ్రీవారి దర్శనానికి భక్తుల నిలిపివేత

tirumala temple

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం( టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం సాయంత్రం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవారి మూలవరులకు నిర్వహించే సేవలను మాత్రం యథావిధిగా నిర్వహిస్తామని టీటీడీ తెలిపింది. తిరుమలకు భక్తులు వచ్చే రెండవ ఘాట్ రోడ్డును కూడా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు ప్రకటించారు.

తిరుమల ఘాట్‌రోడ్లను అలిపిరి గరుడ సర్కిల్‌ నుంచి వచ్చే భక్తులను అధికారులు వెనక్కి పంపుతున్నారు. ఎగువ ఘాట్‌ రోడ్డుపైకి వాహనాలు వెళ్లకుండా అధికారులు నిలిపివేస్తున్నారు. కొండ పైనుంచి వాహనాలను కిందకు మాత్రమే అనుమతిస్తున్నారు. కొండ పైనుంచి వాహనాలన్నీ కిందకు వచ్చాక దిగువ ఘాట్‌ రోడ్డును కూడా మూసేయనున్నారు. అలిపిరి, శ్రీవారిమెట్లు కాలినడక మార్గాలను టీటీడీ అధికారులు మూసివేశారు.

Related posts