telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు సామాజిక

స్టే పిటిషన్‌ ను కొట్టివేసిన కోర్టు.. నిర్భయ దోషులకు ఇక రేపే ఉరి!

nirbaya accuseds

ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలని నిర్భయ దోషులు దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టు తిరస్కరించింది. దీంతో  నిర్భయ దోషులకు శుక్రవారం ఉరి అమలు కానుంది. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ అక్షయ్‌ కుమార్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

మరణ శిక్షను జీవిత ఖైదుగా కుదించాలని పవన్‌ గుప్తా పెట్టుకున్న క్యురేటివ్‌ పిటిషన్‌ను కూడా కోర్టు కొట్టివేసింది. దీంతో ముందు ప్రకటించిన ప్రకారం నలుగురు దోషులకు శుక్రవారం ఉదయం 5.30 గంటలకు తీహార్‌ జైల్లో అక్షయ్ ఠాకూర్ (31), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), ముఖేశ్ సింగ్ (32)లకు మరణశిక్ష అమలు చేయనున్నారు. ఒకే కేసులో నలుగురు దోషుల్ని ఒకేసారి ఉరి తీయడం తీహార్ జైలు చరిత్రలోనే తొలిసారని అధికారులు తెలిపారు.

Related posts