telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిమ్మగడ్డను కలిసిన టీడీపీ నేతలు…

tdp bonda uma counter on ycp comments

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని బోండా ఉమా అన్నారు. ఇప్పటికే ఎస్ఈసీ, హైకోర్టు దృష్టికి ఆగడాలను తీసుకెళ్లినా చర్యలు లేవు. రోజురోజుకూ వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. కడప జిల్లా సింహాద్రిపురంలో పోటీ చేస్తోన్న ఒ మహిళ చీనితోటను నరికేశారు. పులివెందుల, పుంగనూరు, తంబళ్లపల్లె, మాచర్ల, శ్రీకాళహస్తి,రాయచోటి,తంబళ్లపల్లిలో దౌర్జన్యాలు కొనసాగుతున్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేనట్లూ వైసీపీ ప్రభుత్వంలోనే ఏకగ్రీవాలు ఎందుకవుతున్నాయి అని అన్నారు. పోలీసులు వైసీపీ ప్రభుత్వానికి జీ హుజూర్ అనడంతోనే ఇష్టానుసారం ఏకగ్రీవాలు జరుగుతున్నాయి. దౌర్జన్యకర పరిస్థితులను ఇప్పటికైనా వైసీపీ విడనాడాలి అని తెలిపారు. ఇక ఈరోజు టీడీపీ నేతలు బోండా ఉమా, ఆలపాటి రాజా, అశోక్ బాబు ఎస్ఈసీ నిమ్మగడ్డను కలిశారు. అయితే కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని ఎస్ఈసీని కోరాం. రాజ్యాంగ బద్ద వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. రాష్ట్రంలో జరుగుతోన్న అరాచకాలను ఎస్ఈసీ దృష్టికి తెచ్చాం. ఏకగ్రీవాలు రద్దు చేసి ఎన్నికలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరాం అని తెలిపారు. చూడాలి మరి దీని పై వైసీపీ ఎలా స్పందిస్తుంది అనేది.

Related posts