telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కాకినాడ కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్ధుల‌కు అస్వ‌స్థ‌త‌..

కాకినాడ జిల్లా వలసపాకల కేంద్రీయ విద్యాలయలో 30 మంది విద్యార్థులు అకస్మాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఐదు, ఆరు తరగతుల విద్యార్థులకు ఒక్కసారిగా ఊపిరాడకపోవడంతో పాటు కళ్లు తిరిగి పడిపోయారు.

దీంతో హుటాహుటిన అస్వస్థతకు గురైన విద్యార్ధులను వలసపాకలలోని  ప్రైవేట్ ఆస్ప‌త్రి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారు. విద్యార్ధుల అస్వస్ధతకు గల కారణాలు తెలుసుకునేందుకు రక్త నమూనాలను వైద్యులు సేకరించారు.

30 Students Fell Sick Lost Consciousness At School In Valasapakala Kakinada  - Sakshi

స‌మాచారం అందుకున్న‌ పోలీసులు, అధికారులు స్కూల్ వద్దకు చేరుకుని కారణాలను ఏం జరిగిందో పరిశీలిస్తున్నారు.  అస్వస్థతకు గల కారణాలను టీచర్స్‌, విద్యార్ధులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు.

కాగా తమ పిల్లలకు ఏమైందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల రోదనలతో స్థానికంగా హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి.

 

Related posts