ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఏపీ ఉద్యోగులకు 23. 29 శాతం ఫిట్ మెంట్ అందించడంతో పాటు, రిటైర్‌మెంట్ వయస్సు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల నుంచి విరమణ వయసు పెంపు అమలవ్వనుందని తేలిపారు.
.శుక్రవారం నాడు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం భేటీ అయ్యారు.ఈ సమావేశానికి ముందే ఏపీ సీఎం జగన్ ఆర్ధిక శాఖాధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచారు.
ఉద్యోగ సంఘాలతో ఇవాళ నిర్వహించిన సమావేశం తర్వాత మాట్లాడుతూ.. 23.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. జనవరి 1, 2022 నుంచి పెంచిన కొత్త జీతాలు చెల్లించనున్నారు. పీఆర్సీ జూలై 1, 2018 నుంచి అమలు కానుంది. మానిటరీ బెనిఫిట్ ఏప్రిల్ 1, 2020 నుంచి అమలు కానుంది. సీపీఎస్‌పై జూన్ 30లోగా నిర్ణయం తీసుకోనున్నారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247కోట్ల అదనపు భారం పడనుంది.
నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను. ఈ ఉదయంకూడా మరోవిడత అధికారులతో మాట్లాడాను. నిన్న నేను 2–3 రోజుల్లో ప్రకటిస్తానని చెప్పాను. కానీ నిర్ణయాన్ని ఎంత వీలైతే అంత త్వరగా చెప్తే మంచిదని భావించి ఈ మేరకు ఉదయం కూడా సమావేశం పెట్టాను.
ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం, సంక్షేమం, అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే.. ఉద్యోగుల సహాయ సహకారాలతోనే సాధ్యం. అది లేకపోతే సాధ్యంకాదు. మా కుటుంబ సభ్యులుగానే మిమ్మల్ని అందర్నీ భావిస్తాను. ఇది మీ ప్రభుత్వం. ఈ భరోసా ఎప్పటికీ ఉండాలన్నదే నా భావనకూడా.
అలాగే కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జూన్ 30 లోగా ఈనియామకాలన్నీ పూర్తి చేయాలని అ«ధికారులకు తక్షణ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హెల్త్ స్కీమ్ అమలులో సమస్యలకు 2 వారాల్లో పరిష్కారం చూపుతామని సర్కార్ హామి ఇచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అందరికీ జూన్ 30లోగా ప్రొమేషన్, కన్ఫర్మేషన్ ప్రక్రియను కంప్లీట్ చేసి, సవరించిన విధంగా రెగ్యులర్ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జూలై జీతం నుంచి ఇవ్వనున్నారు. సొంతిల్లు లేని గవర్నమెంట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్స్‌లో – ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10శాతం ప్లాట్లను రిజర్వ్ చేయడమే కాకుండా 20శాతం రిబేటును ఇవ్వాలని సీఎం హామీ ఇచ్చారు.
నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని.. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటిస్థలం లేదనే మాట లేకుండా చూస్తామని సీఎం హామి ఇచ్చారు. ఆ రిబేటును కూడా ప్రభుత్వమే భరించనుంది.
రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా ఆలోచించాలని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలను గురువారం నాటి సమావేశంలో కోరారు. ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో ఉన్నానని సీఎం తెలిపారు. ఉద్యోగ సంఘాల నేతలు 45 నుండి 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని ఈ సమావేశంలో కోరినట్టుగా సమాచారం.
కాగా అయితే 23.29 శాతం ఫిట్‌మెంట్ కి ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. ప్రభుత్వ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఢిల్లీ మెడలు వంచాలంటే ఎంపీ సీట్లు గెలవాలి: కేటీఆర్