telugu navyamedia
తెలంగాణ వార్తలు

వనమా రాఘవ అరెస్ట్.. అర్థరాత్రి అదుపులోకి తీసుకున్న పోలీసులు …

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్రరావును పోలీసులకు చిక్కాడు.

పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్న అతడిని తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో భద్రాద్రి జిల్లా జిల్లా అదనపు ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద్ రావు ఆధ్వర్యంలో అతడిని శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకొని పాల్వంచ ఎస్పీ కార్యాలయానికి తరలించారు.

కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట మం. మందలపల్లి వద్ద రాఘవతో పాటు అతడి ప్రధాన అనుచరుడు గిరీశ్​, కారు డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఏ-2గా ఉన్న రాఘవను విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. పాల్వంచకు తరలించారు. రాత్రంతా సబ్​డివిజన్​ కార్యాలయంలో పోలీసులు విచారణ చేశారు. తనపై నమోదైన కేసులు, ఆరోపణలపై తెల్లవారుజాము వరకు ప్రశ్నించారు.

Telangana suicide victim's selfie video emerges, TRS MLA's son named again  | The News Minute

ఈ నెల 3న తన భార్య, ఇద్దరు కుమార్తెలు సాహిత్య, సాహితిల‌ పై పెట్రోల్ పోసి నిప్పంటించి.. తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న నాగ రామకృష్ణ.. అంతకుముందు తీసుకున్న సెల్ఫీవీడియోలో వనమా రాఘవపై తీవ్ర ఆరోపణలు చేశాడు.

తమకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని పంచుకునే క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం తలెత్తగా, వనమా రాఘవ అందులో తలదూర్చడమే కాకుండా.. పిల్ల‌ల‌ను వ‌దిలి తన భార్యను హైదరాబాద్ తీసుకు వచ్చి అప్పగిస్తే ఆస్తి దక్కేలా చూస్తానని బేరం పెట్టాడని…అవమానం భరించలేక కుటుంబంతో సహా చనిపోతున్నట్లు రామకృష్ణ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే గురువాం ఈ సెల్ఫీ వీడియో ఘటన బయటికి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్న రాఘవ ఆచూకీ కోసం పోలీసులు పలు టీమ్‌లుగా ఏర్పడి అతడి కోసం… రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలింపు చేపట్టారు

 కొద్దిరోజులుగా తొర్రూరు, హైదరాబాద్‌, సూర్యాపేట, చీరాల, విశాఖపట్నం, రాజమండ్రికి ప్రయాణాలు సాగించినట్లు తెలిసింది. ఒక్కోచోట ఒక్కో సిమ్‌కార్డును మార్చుతూ పోలీసులకు పట్టుబడకుండా జాగ్రత్తపడ్డాడు. విశాఖలో రెండురోజులపాటు తలదాచుకున్న రాఘవ శుక్రవారం అక్కడి నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా పశ్చిమ గోదావరి, భద్రాద్రి జిల్లా సరిహద్దుల్లో మందలపల్లి అడ్డరోడ్డు వద్ద రాఘవను పోలీసులు పట్టుకున్నారు.

గతేడాది వెంకటేశ్వరరావు ఆత్మహత్య కేసులో రాఘవకు నోటీసులు ఇవ్వటం సహా.. రాఘవపై గతంలో నమోదైన కేసులను పోలీసులు వెలికితీస్తున్నారు.

రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తీవ్ర ఆరోపణలు రావడంతో అధికార టీఆర్ ఎస్‌ అధిష్ఠానం వనమా రాఘవను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Related posts