ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ రేపు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటన పర్యటించనున్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను ప్రారంభించనున్నారు సీఎం.
అనంతరం అక్కడ జరిగే బహిరంగసభలో జగన్ మాట్లాడతారు. ఆ తర్వాత నెల్లూరు చేరుకుని నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు.
ఈ బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెట్టిన విషయం తెలిసిందే. అక్కడ సంగం బ్యారేజీని ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
మంగళవారం వైఎస్ జగన్ షెడ్యూల్ ఇలా ఉంది..
*6వ తేదీ ఉదయం 9.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరనున్న సీఎం జగన్
*10.40 గంటలకు సంగం బ్యారేజ్ వద్దకు చేరుకుంటారు.
* 11 గంటల నుంచి 1.10 వరకూ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ను ప్రారంభించి, అక్కడే బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం వైఎస్ జగన్.
* 1.20 గంటలకు సంగం నుంచి బయదేరి 1.45 కు నెల్లూరు బ్యారేజి సైట్ కు చేరుకోనున్న సీఎం జగన్.
*1.50 గంటల నుంచి 2.20 గంటల వరకూ నెల్లూరు బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ ని ప్రారంభించనున్న సీఎం జగన్.
* 2.20 గంటలకు అక్కడ నుంచి బయలుదేరి సాయంత్రం 4.15 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్