సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా 19న వెలువడుతుందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు.పోటీ చేయడానికి ఆసక్తి ఉన్న నేతల పేర్ల జాబితాతో ఢిల్లీ చేరుకున్న రఘువీరా శుక్రవారం స్ర్కీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా షార్ట్‌లిస్ట్ చేసిన పేర్లను కమిటీకి సమర్పించారు.
చాలా నియోజకవర్గాలకు ఒకే పేరు వచ్చినట్లు సమాచారం. కొన్ని స్థానాలకు మాత్రమే ఇద్దరు ముగ్గురు నేతలు పోటీపడుతున్నట్లు తెలిసింది. 25 ఎంపీ స్థానాలకు 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులపై చర్చించాం. 19న కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తుది జాబితాను ఆమోదించి వెల్లడిస్తుందన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి మరణం పై అనుమానాలున్నాయని, దోషులను కఠినంగా శిక్షించాలని రఘువీరా అన్నారు.