telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మంచి భోదనతో సమాజాన్ని మార్చే శక్తి గురువులకు మాత్రమే ఉంది..

*ఉచితంగా నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డ‌మే మా విధానం
*టీచ‌ర్ల‌కు ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఏమాత్రం లేదు..
*ఉద్యోగుల పెన్ష‌న్ విష‌యంలో చిత్త‌శుద్దితో ప‌ని చేస్తున్నాం..

తల్లిదండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువు మాత్రమే అన్నారు ఏపీ సీఎం జగన్. గురుపుజోత్సవం సందర్భంగా విజయవాడలో ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులనుఘనంగా సత్కరించి పురస్కారాలు అందజేశారు.

ఈ సందర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ..మంచి భోదనతో సమాజాన్ని మార్చే శక్తి గురువులకు మాత్రమే ఉందన్నారు. విద్యారంగాన్ని మెరుగు పరిచేందుకు అనేక గొప్ప కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు.

పెద్ద చదువులకు పేదరికం అడ్డు రాకూడదు..నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడానికి, పిల్లలకు మంచి భవిష్యత్తు అందించడం కోసమే మార్పులు చేస్తున్నామని స్పష్టం చేశారు.

విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర గురువులదేనన్నారు .నాణ్యమైన చదువులు అందరికీ అందుబాటులో ఉండాలని అన్నారు.

విద్యార్ధులు మంచి చదువులు చదవాలనేదే సంస్కరణల లక్ష్యమన్నారు. అని రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

విద్యార్థులకు పౌష్టికాహారం అందిండచమే కాకుండా మోనులో మార్పులు చేశామన్నారు. టీచర్లు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Related posts