telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అమలాపురంలో ప్రభుత్వ స్పాన్సర్డ్ విధ్వంసం..

*అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్‌ విధ్వంసం
*అనంత‌బాబు కేసు నుంచి దృష్టి మ‌ల్లించేందుకు ప్ర‌య‌త్నం.
*శాంతి భద్ర‌త‌ల‌పై ప‌రిర‌క్షించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంది..
*15 రోజులుగా అమ‌లాపురంలో సీఐ ఎందుకు లేర‌ని ప్ర‌శ్నించారు..

అమలాపురం అల్లర్లు ప్రభుత్వ స్పాన్సర్డ్‌ విధ్వంసమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… . లా అండ్ ఆర్డర్‌లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఇళ్లు తగలబడుతుంటే ఫైర్ ఇంజన్లు ఒక్కటి కూడా లేవా అని ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి జరిగిందంటే ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు

అమ‌లాపురంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటే అంత మంది ఎలా వచ్చారని ప్రశ్నించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటి మీది దాడి జరిగిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని నిలదీశారు. మంత్రి విశ్వరూప్‌ ఇంటికి ఎందుకు భద్రత కల్పించలేకపోయారని అడిగారు.

ఎస్సీ వ్యక్తి డ్రైవ‌ర్ సుబ్ర‌మ‌ణ్యంని ఇంట్లో నుంచి తీసుకెళ్లి వైసీపీ ఎమ్మెల్సీ చంపేశారని.. హత్య ఘటన నుంచి దారి మళ్లించేందుకే విధ్వంసం సృష్టించారని విమర్శించారు

ప్రజల దృష్టి మళ్లించడం డైవర్షన్‌ సీఎంకు బాగా అలవాటని యెద్దేవా చేశారు. కోనసీమను విధ్వంసం చేయాలని జగన్‌ కంకణం కట్టుకున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. .

మూడేళ్లుగా రాష్ట్రంలో వైసీపీ విధ్వంసం చేస్తూనే ఉందని ఆరోపించారు. అమలాపురంలో జరిగింది ప్రభుత్వం స్పాన్సర్ చేసిన విధ్వంసం అని మండిపడ్డారు. హత్య ఘటన నుంచి దృష్టి మళ్లించేందుకే విధ్వంసమని అన్నారు.

ఐతే మంగళవారం అమలాపురంలో జరిగిన అల్లర్లలో అన్యం సాయి అనే వ్యక్తి కీలకపాత్ర పోషించాడంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. వాస్తవాలు స్పష్టంగా ఉంటే హోం మంత్రి టీడీపీపై నిందలు వేస్తారా అని ప్రశ్నించారు.

అన్నం సాయి టీడీపీ కార్యకర్త అయితే సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు కౌగిలించుకుంటారని నిలదీశారు. ఈ సందర్భంగా సజ్జల, విశ్వరూప్‌తో అన్నం సాయి ఉన్న ఫొటోలను అచ్చెన్నాయుడు విడుదల చేశారు.

Related posts