telugu navyamedia
ఆంధ్ర వార్తలు

విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి జ‌గ‌న్ షాక్

వైసీపీ కీలక నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. మంగళవారం రోజున 28 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను వైసీపీ అధినేత, సీఎం జగన్ నియమించారు.

గత కొంతకాలంగా వైసీపీ ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న విజయసాయి రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు . పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డిని నియమించారు. ఆ బాధ్యతలను తితిదే చైర్మన్  వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు.

Andhra result: Jagan's right-hand man to play key role in government

పార్టీలో కీలక పదవులు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, కడప మేయర్ కె.సురేష్ బాబు, విజయనగరం జడ్పీ చైర్మన్ చిన్న శ్రీనులకు దక్కాయి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఆయన కుమారుడు మిథున్ రెడ్డికి ఎంపీ మిధున్ రెడ్డిలకు మాత్రం 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు.మంత్రి రామచంద్రారెడ్డికి 4 జిల్లాలు బాధ్యతలు అప్పగించగా.. వాటి పరిధిలోని 27 నియోజకర్గాలు ఉన్నాయి.. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డికి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని 5 జిల్లాలు, వీటి పరిధి 35 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. తండ్రీకొడుకులకు మొత్తంగా జిల్లాలు, వాటి పరిధిలోని 62 నియోజకవర్గాల బాధ్యతలను ఇచ్చారు.

 

అధికార పార్టీలో ముఖ్యమంత్రి జగన్ తర్వాత కీలకంగా వ్యవహరిస్తోంది ఎంపీ విజయసాయి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలే.. ఇప్పుడు పదవుల పంపకాల్లో ఆ ముగ్గురిలోప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డికి మరిన్ని బాధ్యతలను అప్పగించారు

 గతంలో కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాల స్థానంలో కర్నూలు, నంద్యాల బాధ్యతలను అప్పగించారు. ఈ బాధ్యతలను సజ్జల, బుగ్గన సంయుక్తంగా చూడనున్నారు. దాంతో పాటు ప్రాంతీయ సమన్వయకర్తల, పార్టీ జిల్లా అధ్యక్షుల కో–ఆర్డినేటర్‌గా సజ్జలకు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్.

Related posts