telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కోడి పందాలపై కొడాలి నాని ఆసక్తి కర వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సాంప్రదాయానికి నిలువుటద్దం, అలా మరో పండగ జరపరంటే అతిశయోక్తికాదు. పండగంటే పండగేకాదు.. సందడికి మరో పేరు అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరూ ఈ పండుగను మూడు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా ఎలా జరుపుకుంటారో.. సంక్రాంతి సందర్భంగా కోడి పందేలతో అంతే హోరెత్తిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది కోడిపందాలు. మిగతా వేటినైనా మిస్ అవ్వడానికి ఇష్టపడుతుంటారు కానీ కోడిపందాలు మాత్రం ప్రజలు మిస్ అవ్వరు . ఎన్ని పనులున్నా ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా కోడి పందేలను చూడడానికి మాత్రం వచ్చేస్తారు. కోడి పందేల్లో పాల్గొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ప్రముఖులు పాల్గొంటారు. కోళ్ల పందాలపై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంక్రాంతి రైతుల పండుగ అని… ఎడ్ల పందాల వల్ల ఒంగోలు గిత్త జాతి పరిరక్షణ కు ఎక్కువ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కోళ్ల పందాల్లో జీవ హింస ఉంటుంది… ఎడ్ల పందాల్లో ఉండదని తెలిపారు. తెలంగాణలో ఖమ్మం, నల్గొండ జిల్లాల, రాయలసీమలో కర్నూలు, కడప జిల్లాల నుంచి ఎక్కువగా పోటీకి ఎడ్లు వస్తాయని… వంద జతల ఎడ్లు పోటీల్లో పాల్గొన్నాయన్నారు. 

Related posts