telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

అమిత్ షా వద్దకు ఆర్టీసీ పంచాయితీ!

amith shah bjp

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు కొంత కాలంగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. మంగళవారంలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలంటూ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం జేఏసీ నేతలు… రాష్ట్ర బీజేపీ నేతలతో పాటు టీజేఎస్, సీపీఐ, టీడీపీ నేతలను కలిశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి తమ సమస్యలు వివరించడానికి తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ సిద్ధమైంది.

తాము చేస్తోన్న సమ్మెను జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ పరిస్థితిని అమిత్ షా కు వివరిస్తామని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిందిగా కోరతామని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి చెప్పారు. ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తోన్న సమ్మెను వివరించి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలనిఅమిత్ షా ను కార్మికులు కోరనున్నారు.

Related posts