telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కెప్టెన్‌ కోహ్లి కూతురిపై బిగ్ బీ ట్వీట్

Amitab

టీం ఇండియా కెప్టెన్‌ కోహ్లీ, అనుష్క శర్మకు సోమవారం పండంటి పాప జన్మించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నాడు. దీంతో సెలబ్రిటీల నుంచి అభిమానుల వరకు విరుష్క జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మన క్రికెట్‌ టీం అంతా కలిసి ఫ్యూచర్‌ మహిళల క్రికెట్‌ టీంను తయారు చేస్తోందంటూ బిగ్‌ బీ ఫన్నీగా ట్వీట్‌ చేశాడు. ఇందులో క్రికెటర్లందరికీ కూతుళ్లే పుట్టారంటూ వరుసగా ఒక్కొక్కరి పేరు రాసుకుంటూ వెళ్లాడు. ధోనీ కూతురు ఈ టీంకు కెప్టెన్‌గా ఉంటుందేమో అని కామెంట్‌ చేశాడు. ఆ లిస్ట్‌లో వరుసగా రైనా, గంభీర్‌, రోహిత్‌, షమీ, జడేజా, పుజారా, సాహా, భజ్జీ, నటరాజన్‌, ఉమేష్‌ యాదవ్‌ల పేర్లు ప్రస్తావించాడు. ఇప్పుడు కోహ్లీకి కూడా కూతురే పుట్టిందంటూ.. వీళ్లంతా ఫ్యూచర్‌ మహిళల క్రికెట్‌ టీంను తయారు చేస్తున్నారని ట్వీట్‌ చేశాడు. బిగ్‌ బీ ట్వీట్‌పై అభిమానులు సరదగా ట్వీట్స్‌ చేస్తున్నారు.

Related posts