telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాస్టర్ : ఆకట్టుకుంటున్న “కుట్టిస్టోరీ” సాంగ్

Master

ఇళయ దళపతి విజయ్ హీరోగా ఇటీవల ‘ఖైదీ’ చిత్రంతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మాస్టర్’. ఎక్స్ బి ఫిలిమ్ క్రియేటర్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ డ్రామాలో విజయ్ సరసన మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, నాజర్, సంజీవ్, సంతానం ఇతర పాత్రల్లోనూ, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్, సెకండ్ లుక్ పోస్టర్స్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సినిమా నుండి యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ కంపోజ్ చేసిన ‘కుట్టి స్టోరి’ అనే పల్లవితో సాగే లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. అరుణ్ రాజా కామరాజ్ లిరిక్స్ అందించిన ఈ సాంగ్‌ని హీరో విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కలిసి పాడడం విశేషం. జీవితం చాలా చిన్నది, మనకు లైఫ్‌లో కలిగే బాధలను, టెన్షన్స్‌ను పక్కన పెట్టి లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ జీవించాలి అనే కాన్సెప్ట్‌తో మంచి జోష్‌తో సాగే ఈ సాంగ్‌కి యువత‌తో పాటు మాస్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇంగ్లీష్ లిరిక్స్ వింటుంటే అనిరుధ్ ‘కొలవెరి’ పాట గుర్తొస్తుంది. ఇక ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ సాంగ్ రిలీజ్ తరువాత సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్ 9 న రిలీజ్ చేయనున్నారు.

Related posts