telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను జాతికి అంకితం చేసిన సీఎం జ‌గ‌న్‌..

నెల్లూరు జిల్లాలో  మేకపాటి గౌతం రెడ్డి సంగం బ్యారేజీని, నెల్లూరు బ్యారేజీలను ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు జాతికి అంకితం చేశారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు.

సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను జాతికి అంకితమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రూ. 380 కోట్లు ఖర్చు చేసి సంగం, నెల్లూరు బ్యారేజ్‌ పూర్తి చేశామన్నారు. 5 లక్షల ఎకరాల సాగు భూమి స్థిరీకరించామని పేర్కొన్నారు.

‘నెల్లూరు జిల్లాలో కరువు మండలమే ఉండదు. వైఎస్సార్‌ సీఎం అయ్యాక నెల్లూరు జిల్లా గురించి ఆలోచించారు. వైఎస్సార్‌ ప్రారంభించిన ప్రాజెక్ట్‌ను పూర్తి చేసినందుకు గర్వపడుతున్నా. ప్రతికూల పరిస్థితలను ఎదురొడ్డి రెండు ప్రాజెక్ట్‌లను పూర్తి చేశాం. మూడేళ్లలోనే సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను పూర్తి చేశామ‌ని అన్నారు.

CM Jagan inaugurates MGR Sangam and Nellore barrages | INDToday

గౌతమ్‌రెడ్డి మన మనసులో చిరస్థాయిగా ఉండిపోతారు. సంగం బ్యారేజ్‌కు మేకపాటి గౌతమ్‌రెడ్డిగా నామకరణం చేసుకున్నామని సీఎం జగన్‌ వ్యాఖ్యానించారు. చివరగా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సీఎం జగన్‌ ముందుంచిన అన్నిప్రతిపాదనలకు బహిరంగ సభ వేదికగా వాటికి ఆమోదం తెలిపారు.

సంగం బ్యారేజ్ కి 2008లో నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేయగా, నేడు ఆయన తనయుడు జగన్ హయాంలో ప్రాజెక్ట్ పూర్తయింది. పెన్నా డెల్టా, కనుపూరు కాలువ, కావలి కాలువల కింద సుమారు 3,85,000 ఎకరాల ఆయకట్టు ఈ బ్యారేజ్ వల్ల సాగులోకి వస్తుంది. రూ. 335.80 కోట్ల రూపాయల వ్యయంతో బ్యారేజ్ నిర్మించారు.

CM Jagan inaugurates MGR Sangam and Nellore barrages | INDToday

ఈ బ్యారేజ్ నిర్మాణం వల్ల పొదలకూరు సంగం మండలాల మధ్య గల రాకపోకల సమస్యలు పరిష్కారం అవుతుంది. బ్యారేజ్ లో 0.45 టీఎంసీల నీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. దీనివల్ల భూగర్భజల మట్టం పెరిగి చుట్టుప్రక్కల గ్రామాలలోని త్రాగు నీటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. తీవ్ర వరద పరిస్థితులలో ఈ బ్యారేజీ వరద నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది. సంగం బ్యారేజ్ పర్యాటకంగా కూడా ఆకర్షణీయమైన ప్రాజెక్ట్ గా మారుతుంది. ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తి కాకమునుపే మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందడంతో.. ఆయన పేరుని ఈ బ్యారేజ్ కి పెట్టారు.

Related posts