ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. దాంతో దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. రోజుకు రెండు లక్షలకు పైగా కేసులు వస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఇక కరోనా ఆసుపత్రులను పెంచుతూ ఇప్పటికే అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా రోగులకు టెస్టులు నిర్వహిస్తూ చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, తమిళనాడులోని కొడైకెనాల్ లోని కరోనా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు రోగులు సడెన్ గా ఆసుపత్రి నుంచి పరారయ్యారు. దీంతో వైద్యులు షాక్ అయ్యారు. నాలుగురోజుల క్రితం గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి కూతురిని చూసేందుకు ముగ్గురు వ్యక్తులు కొడైకెనాల్ కు వచ్చారు. అలా వచ్చిన ముగ్గురు వ్యక్తులు కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడిన ముగ్గురు వ్యక్తులను ప్రైవేట్ ఆసుపత్రుల్లో జాయిన్ చేశారు. అయితే, వసతులు సరిగా లేవని చెప్పి తన కూతురితో సహా ముగ్గురు వ్యక్తులు రాత్రికి రాత్రే అహ్మదాబాద్ కు పరారయ్యారు. దీంతో ఈ ఘటన పై పోలీసులకు సమాచారం అందించారు.
previous post
ప్రజలు మార్పు కోరుకున్నారు: గంటా శ్రీనివాస్