వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. కెనాల్ పనుల నిలిపివేతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు జల వనరుల శాఖ స్పెషల్ సెక్రెటరీకి ఓ లేఖ రాశారు.చిత్తూరు జిల్లా కుప్పం, పలమనేరు రైతులకు ఈ కెనాల్ నీరు ఎంతో ముఖ్యమని అన్నారు.
కెనాల్ పనులు ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయనిపేర్కొన్నారు. కేవలం 10 శాతానికి సమానమైన రూ. 50 కోట్ల విలువైన పనులు మిగిలివున్న సమయంలో పనులు నిలిపివేశారని ఆయన ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత జల వనరుల ప్రాజెక్టులను పట్టించుకున్న దాఖలాలు లేవని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ కెనాల్ పనులు వేగంగా సాగాయని తెలిపారు. ఇప్పుడు ఏడాదిగా బిల్లులు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
జగన్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలి: స్వామి శ్రీనివాసానంద