telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గ్రామ పంచాయతీ కార్మికుల .. వేతనం పెంపు.. పండుగ కానుక.. కేసీఆర్

KCR cm telangana

తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు శుభవార్త అందించింది. కార్మికుల వేతనాలను నెలకు రూ.8,500లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య, ఇతర కార్మికులకు ఒక్కో గ్రామంలో ఒక్కోలా వేతనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం అన్ని పంచాయతీల్లో ఒకే రకమైన వేతనాలు ఉండేలా నిర్ణయం తీసుకుందని తెలిపారు..పెంచిన జీతాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం జీతాలు పెంచడంతో కార్మికుల కుటుంబాల్లో దీపావళి ముందే వచ్చింది. కేసీఆర్ నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కొందరు అనుకుంటున్నారట..

ఈ సమయంలో పారిశుద్ద కార్మికుల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఒక వైపు రాష్ట్రం సమ్మెలతో అట్టుడికి పోతుంటే ఆర్టీసీ కార్మికుల పట్ల టీఆర్ఎస్ గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు సరికాదని కేసీఆర్ నిరంకుశ పాలన మంచిది కాదంటూ కొన్ని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థి సంఘాలు కూడా ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఏబీవీపీ కార్యకర్తలు కదం తొక్కారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఆర్ట్స్ కళాశాల దగ్గర సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ నినదించారు.

Related posts