ఆసీస్ పర్యటన ప్రారంభం అయిన దగ్గర నుండి భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ముఖ్యమైన బౌలర్లు అందరూ జట్టును వదిలి వెళ్లిపోతున్నారు. మొదట ఇషాంత్ శర్మకు ఐపీఎల్ లో గాయం కావడంతో ఈ పర్యటన నుండి తప్పుకున్నాడు. ఆ తర్వాత మొదటి టెస్ట్ మ్యాచ్ లో షమీకి గాయం కావడంతో అతను టెస్ట్ సిరీస్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక మరో పేసర్ ఉమేష్ యాదవ్ ది కూడా అదే పరిస్థితి. రెండో టెస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్న సమయంలో ఉమేష్ గాయం బారిన పడ్డాడు. ఆ తర్వాత మొత్తం సిరీస్ కే దూరమయ్యాడు. ఇక తాజాగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ లో సీనియర్ బౌలర్లు ఇద్దరు జట్టుకు దూరం కానున్నారు. గాయం కారణంగా బ్రిస్బేన్ వేదికగా జరగనున్న నాలుగో టెస్ట్ నుంచి బూమ్రా, జడేజా తప్పుకున్నారు. అయితే నాలుగో టెస్టులో ఎవరు విజయ సాధిస్తే వారిదే సిరీస్ అనే తరుణంలో కీలకమైన ఇద్దరు ఆటగాళ్లు జట్టుకు దూరం కావడం పెద్ద దెబ్బ అనే చెప్పాలి. అలాగే నిన్న బ్యాటింగ్ చేసిన విహారి, అశ్విన్ కూడా వెన్నునొప్పితో బాధపడుతున్నారు.
previous post
next post