telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

మహబూబాబాద్ జిల్లాలో మరో మైనర్ బాలిక పై అత్యాచారం…

శీలానికి వెలకట్టే యత్నం చేసిన పెద్దలు…పెళ్లిచేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి ఇప్పుడూ పెళ్లికి ఓ యువకుడు నిరాకరించడంతో న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ వెళ్తే రాజీపడలని పెద్దమనుషులు ఒత్తిడి చేయడంతో ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన మహాబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లాలో ఇప్పటికే మైనర్ బాలికను అత్యాచారం… హత్య చేసిన ఘటన 24 గంటలు గడవకముందే…. మరో మైనర్ బాలికను గర్భవతిని చేసి మోసం చేసిన సంఘటన జిల్లాలో వెలుగు చూసింది. మహాబూబాబాద్కేంద్రం శివారు బాబు నాయక్ తండాలో ఓ మైనర్ బాలికను… అదే తండాకు చెందిన భూక్యా.అమృతం అలియాస్ దాదా అనే యువకుడు 4 సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నానని.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు.బాలిక పెళ్లిచేసుకోవాలని నిలదీయడంతో పెద్దమనుషుల ముందు పంచాయతీ చేసుకుందామని 3 రోజులు గా తిప్పిస్తు…రాజీ పడాలని పెద్దమనుషులు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన మైనర్ గర్భిణీ వ్యవసాయ బావిలో పడి ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది.స్థానికులు గమనించి ఆ గర్భిణిని కాపాడి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.పట్టణ పోలీసులు గర్భవతిని చేసిన యువకుని పై ఫోక్సో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related posts