telugu navyamedia
క్రీడలు వార్తలు

పురుషులకు మహిళా క్రికెట్ కోచ్…

తొలిసారి పురుషుల క్రికెట్‌ జట్టుకు కోచ్‌గా ఓ మహిళా ఎంపికయ్యారు. ఇంగ్లండ్‌లోని దేశవాళీ జట్టు ససెక్స్‌ కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించిన ఇంగ్లండ్ మాజీ మహిళా క్రికెటర్‌ సారా టేలర్‌ ఈ అరుదైన ఘనత సాధించారు. క్రికెట్‌లో పురుషులతో సమానంగా అత్యున్నత క్రికెటర్‌గా పేరు పొందిన సారా టేలర్‌ 2019లో ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే పురుషుల జట్టుకు కోచ్‌గా ఎంపికయిన సందర్భంగా సారా టేలర్‌ మాట్లాడుతూ… ససెక్స్ ‌కు వికెట్‌ కీపింగ్‌ కోచ్‌గా పనిచేయనుండడం చాలా సంతోషంగా ఉంది. ఆ జట్టులో ప్రతిభావంతమైన క్రికెటర్ల బృందం ఉంది. వారితో పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. నా అనుభవం.. నైపుణ్యాలను వారికి పంచి నా వంతు సహకారం అందిస్తా. అని అన్నారు. ఇంగ్లండ్ తరఫున 10 టెస్టులు, 126 వన్డేలు, 90 టీ20లు ఆడిన సారా టేలర్‌ వరుసగా 300, 4056, 2177 పరుగులు చేశారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 104 స్టంపింగ్స్‌, 128 క్యాచులు అందుకున్నారు.

Related posts