‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఈ రీమేక్ కు వివి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా… పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. అయితే చాలాకాలంగా ఈ హిందీ రీమేక్ లో బెల్లంకొండ సరసన స్టార్ హీరోయిన్ ను నటింపజేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఇంతకుముందు బావు భామ కియారా అద్వానీ, మరికొంతమంది బి-టౌన్ హీరోయిన్లను మూవీ టీం సంప్రదించిందట. మేకర్స్ భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినప్పటికీ ఈ సినిమాలో నటించడానికి నిరాకరించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నటించడానికి నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని ఆశ్రయించారట మేకర్స్. అందుకు గానూ రూ.2 కోట్ల భారీ రెమ్యూనరేషన్ కు కూడా ఆఫర్ చేశారట ఆమెకు. కానీ తన బిజీ షెడ్యూల్ కారణంగా సాయి పల్లవి ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందట. మరి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి.
previous post
next post