telugu navyamedia
ట్రెండింగ్ రాశి ఫలాలు వార్తలు సామాజిక

రాశిఫలాలు : .. ఆర్థికస్థితి సామాన్యం.. వినోదయాత్రలు…

today rasi falalu

మేషం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కంటికి, తలకి సంబంధించిన ఆరోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. అలాగే పని ఒత్తిడి కారణంగా అలసట అధికంగా ఉంటుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గటానికి శివారాధన చేయడం మంచిది.

వృషభం : ఈ రోజు ఎక్కువ సమయం ప్రయాణాలతో, బంధుమిత్రులను కలువడంలో వెచ్చిస్తారు. ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం కాని, వినోద యాత్ర చేయటం కాని చేస్తారు. గృహ సంబంధ ఒప్పందాలు పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది.

మిథునం : ఈ రోజు ఆర్థిక స్థితి సామాన్యంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆవేశానికి, కోపానికి లోను కాకుండా వ్యవహరించటం మంచిది. మీ ఆవేశం కారణంగా పైఅధికారుల కోపానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు, ఒప్పందాలకు అంతగా అనుకూలమైన రోజు కాదు.

కర్కాటకం : ఈ రోజు మీకు అనుకోని విధంగా డబ్బు చేతికి అందటం కాని, రావలసిన డబ్బు తిరిగి రావటం కాని జరుగుతుంది. ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది. కుటుంబ సభ్యులు, మిత్రుల సాయంతో వృత్తి పరంగా ఉన్న సమస్యలను తొలగించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సింహం : ఈ రోజు మీరు చేసే పనుల్లో ఆటంకాలు అధికంగా ఉంటాయి. మీ సహోద్యోగులతో, పై అధికారులతో సామరస్యంగా వ్యవహరించటం మంచిది. మీ అజాగ్రత్త కారణంగా వారి కోపానికి గురయ్యే అవకాశమున్నది. వారితో వాదనకు దిగకండి. ఆవేశ పూరితమైన మీ ప్రవర్తన కారణంగా బంధువులతో వివాదం కొని తెచ్చుకోకండి.

కన్య : ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోద యాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

తుల : ఈ రోజు మీరు అనుకున్న పనులు కొన్ని ఆటంకాలతో పూర్తి అవుతాయి. కొత్త పనులు ప్రారంభించటానికి అంతగా అనుకూలమైన రోజు కాదు. అలాగే చేపట్టిన పనుల్లో విజయవంతంగా పూర్తి చేయటానికి అధికంగా శ్రమించాల్సి వస్తుంది. మీ పనికి గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.

ధనస్సు : ఆరోగ్యం విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధపడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.

మకరం : ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.

కుంభం : మీరు చేపట్టే పనుల్లో అవరోధాలు ఏర్పడుతాయి. ముఖ్యంగా మీ కార్యాలయంలో మీరు చేయాలనుకున్న పనికి సహోద్యోగుల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఆవేశానికి లోను కాకుండా సామరస్య పూర్వకంగా వ్యవహరించండి. శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విశ్రాంతి అవసరం.

మీనం : అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.

Related posts