telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశం ప్రస్తుతం సవాళ్లు ఎదుర్కొంటోంది: రాందేవ్‌

Baba Ramdev Sensational comments

భారత దేశం ప్రస్తుతం రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని రాందేవ్‌ పేర్కొన్నారు. ఈ సవాళ్లు అన్నింటినీ అధిగమించి 2040 నాటికి మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భోపాల్‌ లోక్‌సభ బీజేపీ అభ్యర్థిని సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ను రాందేవ్‌ వెనకేసుకొచ్చారు.

అనుమానం పేరుతో ఆమెను తొమ్మిదేళ్ల పాటు జైలులో ఉంచడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘సాధ్వి ప్రజ్ఞా 9 ఏళ్ల పాటు కఠిన కారాగార జీవితం అనుభవించారు. జైల్లో అనుభవించిన బాధల కారణంగానే ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. నేరానికి పాల్పడ్డారన్న అనుమానంతో జైలులో ఆమె పట్ల అవమానవీయంగా ప్రవర్తించడం సమంజసం కాదన్నారు.

Related posts