telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్‌కు అండగా ఉండాలి అని పాక్ ప్రజలకు అక్తర్ సూచన…

Shoaib Akthar Pakistan

ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్న భారత్‌కు సహాయచేద్దామని పాక్ ప్రజలను కోరాడు పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. భారత్‌కు చాలా సంఖ్యల్లో ఆక్సిజన్ ట్యాంకులు అవసరమని, వాటి కోసం విరాళాలు సేకరించి అందజేద్దామని పిలుపునిచ్చాడు. ‘మా ప్రభుత్వం, అభిమానులను ఇండియాకు సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇండియాకు చాలా ఆక్సిజన్ ట్యాంకులు కావాలి. ప్రతి ఒక్కరూ ఇండియా కోసం విరాళాలు సేకరించి, వాళ్లకు అవసరమైన ఆక్సిజన్ ట్యాంకులను అందించాలని కోరుతున్నా.’అని ఆ వీడియోలో అక్తర్ కోరాడు. ఇంతకుముందు కూడా ఇండియాలో కరోనా తీవ్రతను గమనించిన అక్తర్‌.. సాయం చేయాల్సిందిగా ప్రపంచ దేశాలను కోరాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుండగా.. అక్తర్‌ను భారత ప్రజలు కొనియాడుతున్నారు. దేశంలో కరోనా మహమ్మారి పట్టపగ్గాలేకుండా విజృంభిస్తోంది. వైరస్‌ సంక్రమణ రోజుకొక కొత్త రికార్డును అధిగమిస్తోంది. దేశంలో వరుసగా మూడవ రోజు మూడు లక్షలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Related posts