telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ సినిమా వార్తలు

విరాట్ కోహ్లీతో పెట్టుకోవద్దు… అమితాబ్ ట్వీట్

Virat

విరాట్ సూప‌ర్ షోపై బిగ్ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ స్పందించాడు. “విరాట్‌తో పెట్టుకోవ‌ద్దు” అని త‌న ట్వీట్‌లో రియాక్ట్ అయ్యాడు. గ‌తంలో ఓసారి విరాట్‌ను ఔట్ చేసిన స‌మ‌యంలో కెరిక్ వెరైటీగా సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ఇప్పుడు అత‌ని బౌలింగ్‌లో దుమ్మురేపిన కోహ్లీ విండీస్ బౌల‌ర్ మ్యాన‌రిజాన్ని అనుక‌రించాడు. “కోహ్లీ నోట్‌బుక్ స్ట‌యిల్లో కొడుతుంటే.. విండీస్ బౌల‌ర్ ముఖం చూడాల్సిందే” అంటూ అమితాబ్ కామెంట్ చేయ‌డం విశేషం. ఉప్ప‌ల్‌లో మైదానంతో శుక్ర‌వారం విండీస్‌తో జ‌రిగిన తొలి టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చెల‌రేగిన తీరు అంద‌ర్నీ స్ట‌న్ చేసింది. భారీ స్కోర్ చేధించే క్ర‌మంలో విరాట్ త‌న విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. 94 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే మ్యాచ్ 16వ ఓవ‌ర్‌లో విండీస్ బౌల‌ర్ కెరిక్ విలియ‌మ్స్‌కు చుక్క‌లు చూపించాడు. వ‌రుస‌గా బౌండ‌రీ, సిక్స‌ర్‌తో చ‌మ‌ట‌లు ప‌ట్టించాడు. ఆ త‌ర్వాత కెరిక్ స్ట‌యిల్‌ను ఇమిటేట్ చేస్తూ విరాట్ ఆ సంద‌ర్భాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నాడు. విండీస్ బౌల‌ర్ కెరిక్ వికెట్ తీసిన సంద‌ర్భంలో చేతులు పైకి చూపిస్తూ సెల‌బ్రేట్ చేసుకుంటాడు. అత‌ని బౌలింగ్‌లో సిక్స‌ర్ కొట్టిన త‌ర్వాత కోహ్లీ అదే నోట్‌బుక్‌ స్ట‌యిల్‌లో ఆ మూమెంట్‌ను ఎంజాయ్ చేశాడు. దీంతో స్టేడియంలో అరుపులు, కేక‌లు మిన్నంటాయి. 

Related posts