telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సామాజిక

తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold rates hike

బుధవారం కాస్త ఎగసిన బంగారం ధరలు, భారీగా పెరిగిన వెండి ధరలు హైదరాబాద్ లో ఈరోజు తగ్గుదల నమోదు చేశాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయలు తగ్గి 48,050 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం కూడా పది గ్రాములకు 440 రూపాయలు తగ్గుదల నమోదు చేసింది. దీంతో 52,410 రూపాయలుగా నమోదు అయింది. ఈరోజు వెండి ధరలు ఈరోజు వెండి ధర కేజీకి 1800 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగి వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 60,200 రూపాయల వద్ద నమోదు అయింది. ఇక విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. దేశరాజధాని ఢిల్లీలోనూ బంగారం ధరలు తగ్గుదల కనబరిచాయి. అయితే 22 క్యారెట్ల బంగారం దిగిరాగా, 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం కొద్దిగా పైకెగిశాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే 500 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 48,900 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం బుధవారం నాటి ప్రారంభ ధర కంటె 510 రూపాయల పెరుగుదల కనబరిచింది. దాంతో 53,860 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక ఇక్కడ వెండి ధరల విషయానికి వస్తే. ఈరోజు వెండి ధర కేజీకి 1800 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 60వేల రూపాయల స్థాయికి వెండి ధరలు దిగి వచ్చాయి. దీంతో కేజీ వెండి ధర 60,200 రూపాయల వద్ద నమోదు అయింది.

Related posts