telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒకే ఫ్రేమ్ లో ఘట్టమనేని కుటుంబసభ్యులు… మహేష్ లుక్ అదుర్స్

Mahesh

టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని పుట్టినరోజు వేడుకలు కుటుంబమంతా కలిసి ఘనంగా జరుపుకున్నారు. (అక్టోబర్ 7న) ప్రియదర్శిని తన పుట్టినరోజును జరుపుకున్నారు. సుధీర్ బాబు ఇంట్లో జరిగిన ఈ పుట్టినరోజు వేడుకలో కృష్ణ, ఇందిరా దేవి, మహేష్ బాబు, నమ్రత, గల్లా జయదేవ్, గల్లా పద్మావతి, సంజయ్ స్వరూప్, మంజుల, ఆదిశేషగిరి రావు, సుధీర్ బాబు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా ఈ ఫొటోల్లో మహేష్ బాబు లుక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తన ఫ్యామిలీతో గడిపిన ఆనంద క్షణాలను సుధీర్ బాబు ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. కొన్ని ఫొటోలను షేర్ చేశారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రియదర్శిని కేక్ కట్ చేయడం.. కృష్ణతో కలిసి మహేష్ బాబు, నమ్రత, జయదేవ్, సంజయ్ స్వరూప్ భోజనం చేయడం ఫొటోల్లో చూడొచ్చు. సుధీర్ బాబు అసలు పేరు పోసాని నాగ సుధీర్ బాబు. సొంతూరు విజయవాడ. 1999 టైమ్‌లో సుధీర్ బాబు కుటుంబం హైదరాబాద్ వచ్చి సెటిలైంది. ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన సుధీర్ బాబుకు చిన్ననాటి నుంచీ సినిమాలంటే పిచ్చి. మహేష్ బాబు అమ్మమ్మ, సుధీర్ బాబు తల్లి మంచి స్నేహితులట. వాళ్లిద్దరి ద్వారా సుధీర్ బాబు, ప్రియదర్శిని పెళ్లి ప్రస్తావన వచ్చింది. 2006లో ప్రియదర్శినిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. ఇక ఏదేమైనా ఘట్టమనేని కుటుంబ సభ్యులను ఒక దగ్గర చూడడం అనేది సూపర్ స్టార్ అభిమానులకు కన్నుల పండుగగా ఉంది.

Related posts