తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ బిగ్బాస్ సీజన్ 5 గ్రాండ్గా ప్రారంభమైంది. ఫుల్ జోష్తో తనయుడి పాటకు స్టెప్పులేస్తూ ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్ నాగార్జున. తెలుగు ప్రేక్షకులకి పసందైన విందుని అందించేందుకు పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు అంటూ బిగ్ బాస్ ఐదో సీజన్ గురించి బాగానే ప్రమోషన్ చేశారు నాగ్. ఈ సీజన్ లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్న ఆసక్తిని తెరదించుతూ ఒక్కో కంటెస్టెంట్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. హౌస్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గా సీరియల్ నటి సిరి హన్మంత్ ఎంట్రీ ఇవ్వగా.. సెకండ్ ఎంట్రీ ఇచ్చాడు సీరియల్ నటుడు సన్నీ.
వీరిద్దరి తరువాత బిగ్ బాస్ హౌస్ లో తన అందాలతో మంటలు పెట్టింది హాట్ బ్యూటీ లహరి. మూడవ పార్టిసిపెంట్ గా బ్లాక్ ఫ్రాక్ లో హాట్ లుక్స్ తో హౌస్ కి గ్లామర్ డోస్ ఇచ్చింది లహరి. యాంకర్ గా తెలుగు ప్రేక్షకుల్లో పాపులర్ అయిన లహరి ఆ తర్వాత నటిగా పలు తెలుగు సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా విడుదలైన జాంబిరెడ్డి మూవీలోను మంచి పర్ఫార్మెన్స్ కనపరిచింది లహరి. బిగ్ బాస్ అంటేనే గ్లామర్. హాట్ షో. ఇలాంటి అన్ని మసాలా ఆర్భాటాలకు లహరి తన అందచందాలతో న్యాయం చేస్తుందని అంటున్నారు.
బిగ్ బాస్ కంటెస్టెంట్ల వివరాలు..
సిరి హన్మంత్ (యూట్యూబర్) 2. వీజే సన్నీ(సీరియల్ నటుడు) 3. లహరి షెహారి (నటి) 4. శ్రీరామ చంద్ర (ఇండియన్ ఐడల్(సీజన్-5) విజేత) 5. హనీ మాస్టర్ (డ్యాన్స్ మాస్టర్) 6. లోబో 7. ప్రియ (సినీ ఆర్టిస్ట్) 8. మోడల్ జెస్సీ 9. ట్రాన్స్ జెండర్ ప్రియాంకా సింగ్ 10. షణ్ముఖ్ (యూట్యూబర్) 11. హమిద హౌస్ (సినిమా హీరోయిన్) 12. నటరాజ్ మాస్టర్ (డ్యాన్స్ మాస్టర్) 13. సరయు (‘సెవెన్ ఆర్ట్స్’ ఫేమ్)14. విశ్వ (డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటర్) 15. ఉమాదేవి (సినీ ఆర్టిస్ట్) 16. మానస్ (నటుడు) 17. ఆర్జే కాజల్ 18. శ్వేత వర్మ (సినిమా నటి) 19. యాంకర్ రవి
బాలయ్య వ్యాఖ్యలతో చిరు షాకింగ్ డెసిషన్…?