స్త్రీ మూర్తికి శిరసా నమామి
ఆ దేవత లేకుంటే
నేనెక్కడ నా ఉనికెక్కడ
పేగుబంధం తో
తన తనువును పంచుతుంది
తన ప్రాణం కన్నా
నా ప్రాణం కోసమే తపిస్తుంది
తన రక్త మాంసాలతో
నవమాసాలు నా రూపాన్ని మలచడానికి
ఎంతటి వేదనను అనుభవిస్తూందో..
అమ్మ గర్భగదిలో
నేను చేసే అల్లరిని
నా పాదాల దెబ్బలకు
అమ్మ ఎలా తట్టుకుంటుందో
ఆ వేదనను భరిస్తూనే
అమ్మ లోలోపల నవ్వుకుంటుది
నా రూపాన్ని ఊహించుకొని మురిసిపోతుంది
అమ్మ ఆలోచనలు నాకు తెలిసిపోతాయి
నా స్పందన అమ్మకు తెలిసినట్టుగానే
అమ్మ స్పందిస్తె నాకు తెలుస్తుంది
మాఇద్దరి మధ్యన పేగువారధి ఉందిగా..
గర్భగదిలో నేను తిరిగి తిరిగి అలసిపోయి
కదలకుండా ఉంటే అమ్మ విలపిస్తుందట
అమ్మనువైధ్యుని వద్దకు తీసుకువెళ్ళితే
అమ్మ కడుపు కోతకు సిద్ధపడిందట
నన్ను రక్షించుకోవాలని
తనకు ఏమైనా పరావలేదని..
అమ్మ ప్రాణాన్ని పణంగా పెట్టి
నన్ను కాపాడుకున్నదట
అమ్మ చేసిన త్యాగాన్ని
దేనితో వెళ కట్టగలను
ఆ త్యాగానికి ప్రణమిల్లేను
ఈ జన్మనే అంకిత మిచ్చేను
అమ్మ త్యాగానికి సరితూగేది
అమ్మ కన్నా గొప్పనిది
ఈ ప్రపంచాన లేనేలేదు
దేవుడే అమ్మకు బిడ్డగాపుట్టాడు
అమ్మకన్నా గొప్పనైనది లేదని చాటాడు