telugu navyamedia
సినిమా వార్తలు

సినీ దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి మృతి..

ప్రముఖ దర్శకుడు..పి చంద్ర శేఖర్ రెడ్డి ఈ రోజు ఉదయం 8.30 లకు చెన్నై లోమృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు , ఆయన భార్య చాలా సంవత్సరాల క్రితమే మరణించారు . ఆయనకు ఇద్దరు కుమార్తెలు…

చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్యం సంవత్సర కాలం నుంచి బాగాలేదు. జనవరి 3వ తేదీన ఉదయం 8. 30 గంటలకు తుది శ్వాశ విడిచారు . ఆయన వయసు 86 సంవత్సరాలు.

 చంద్రశేఖర్ రెడ్డి సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ నటించిన ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్​బాబులాంటి నాటి ప్రముఖ హీరోలు ల‌తో ప‌ని చేశారు.

చంద్ర శేఖర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమాల్లో ..

భలే అల్లుడు, మానవుడు దానవుడు ,కొడుకులు, బడి పంతులు, విచిత్ర దాంపత్యం , రగిలే గుండెలు, నవోదయం , బంగారు కాపురం , రాజకీయ చదరంగం, అన్నా వదిన, పెద్దలు మారాలి. ఇల్లు ఇల్లాలు , కొత్త కాపురం, గౌరీ , అత్తగారు జిందాబాద్ , బంగారు భూమి ,తల్లీ కొడుకులు మొదలైన చిత్రాలకు దర్శకత్వం వహించారు.

నెల్లూరు నుంచి సినిమా రంగానికి వచ్చిన చంద్రశేఖర్ రెడ్డి మొదట దర్శకుడు వి .మధుసూదన రావు దగ్గర చేరి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పనిచేశారు . చంద్ర శేఖర్ రెడ్డి గారికి గ్రామాలంటే ఎంతో ఇష్టం . గ్రామీణ నేపథ్యంలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు .

ఆయన దర్శకత్వంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలు వున్నాయి . 2016లో చంద్ర శేఖర్ రెడ్డి 64వ జాతీయ సినిమా అవార్డుల కమిటీలో సభ్యుడుగా పనిచేశారు..చంద్రశేఖర్ రెడ్డి మృతికి పలువురు ప్ర‌ముఖులు సంతాపాన్ని తెలిపారు .

Related posts