telugu navyamedia
సినిమా వార్తలు

లైవ్‌లో భార్య‌కు ఐల్‌యూ చెప్పిన బాల‌య్య‌..

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ . ఆహా ఓటీటీలో బాల‌య్య‌ తనదైన హోస్టింగ్‌తో ‘అన్​స్టాపబుల్’​ షోను సూపర్ డూపర్ హిట్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే విజ‌య‌వంత‌గా ఏడు ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నారు.

మొదటి ఎపిసోడ్‌లో మోహన్ బాబు ఫ్యామిలీ, రెండో ఎపిసోడ్‌లో హీరో నాని, మూడో ఎపిసోడ్‌లో బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, నాలుగో దానిలో అఖండ యూనిట్, ఐదో దానికి రాజమౌళి, కీరవాణి, ఆరో దానికి పుష్ప టీమ్, ఏడో దానికి రవితేజ, గోపీచంద్ మలినేని వచ్చారు.

Balakrishna says 'I love you' to wife on 'Unstoppable' - Telugu News - IndiaGlitz.com

తాజాగా 8వ ఎపిసోడ్‌లో దగ్గుబాటి రానాతో బాల‌య్య సందడి చేయబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. జనవరి 7న స్ట్రీమింగ్ కాబోతుంది.

ఈ ప్రోమోలో బాలయ్య తన భార్య వసుంధరకు ఫోన్​ చేసి లైవ్‌లో ఐలవ్యూ అని చెప్పడం అంద‌రం ఆక‌ట్టుకుంది.. రానా దగ్గుబాటి అడిగిన మేరకు బాలకృష్ణ తన సతీమణికి ఫోన్లో ప్రపోజ్‌ చేశారు. ‘వసూ.. ఐ లవ్‌ యు’ అని బాలకృష్ణ తన ప్రేమను వ్యక్తం చేయగా ‘నాకు తెలుసు మీరెప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు’ అంటూ వసుంధర సమాధానమిచ్చారు.

టాక్ షోలలోనే ది బెస్ట్ టాక్ షోగా అన్‌స్టాపబుల్ దూసుకుపోతోందని రానా చెప్పగా… ‘కొత్తగా చెప్తావేంటయ్యా… బాలయ్య అంటేనే బెస్ట్’ అంటూ బాలయ్య కౌంటర్ ఇచ్చారు.

Balakrishna says 'I love you' to wife on 'Unstoppable' - Telugu News - IndiaGlitz.com

అనంత‌రం ‘తొలిసారి బాలయ్య టాక్ షో చేస్తున్నాడంటే నీకు ఏమనిపించింది’ అని రానాను బాలయ్య ప్రశ్నించాడు. ‘తాము టాక్‌ షోలలో మాములు ట్రైన్‌లలో వెళ్తుంటే మీరు బుల్లెట్ ట్రైన్‌లో దూసుకువెళ్తున్నట్లు అనిపిస్తోంది’ అంటూ రానా బదులిచ్చాడు.

అనంతరం… లాక్‌డౌన్‌లో వ్యాక్సిన్ వస్తుందనుకుంటే నీ పెళ్లి న్యూస్ వచ్చిందేంటయ్యా బాబూ అంటూ రానాను బాలయ్య టీజింగ్ చేశారు. మీరెప్పుడైనా వసుంధరగారికి ఐలవ్‌యూ అని చెప్పారా అని రానా అడగ్గా.. నీకెందుకయ్యా అంటూ బాలయ్య నవ్వులు పంచారు. ఆ తర్వాత తన శ్రీమతికి ఫోన్‌ చేసి బాలయ్య ఐలవ్‌యూ చెప్పారు.

unstoppable: Balakrishna: Nandamuri Balakrishna says something interesting about his wife holding his legs! - nbk unstoppable interview with rana daggubati – LT NEWS

మీ భార్యతో ఆర్గ్యుమెంట్ అయితే ఫస్ట్ సారీ చెప్పేది ఎవరు అని రానా అడగ్గా.. కృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్లు పట్టుకున్నాడు.. ఇక బాలకృష్ణుడు ఎంత అంటూ బాలయ్య తనదైన శైలిలో సమాధానమిచ్చారు. అటు ఈ ఇంటర్వ్యూలో ఏమంటివి.. ఏమంటివి అనే డైలాగ్‌ను రానా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. నువ్వు ఎంతమందికి హ్యాండ్‌ ఇచ్చావో, ఎంతమందికి నో చెప్పావో గూగుల్‌ చెప్తుంది’ అంటూ వినోదం పంచారు.

‘అప్పట్లో పూలరంగడులా తిరిగేవాడివి ..పెళ్ళి త‌రువాత మొత్తం సెట్ అయిపోయావు అని రానాపై బాల‌య్య సెటైర్లు వేస్తారు..హో ఈ షో ఇలా వెళుతుందా అని రానా చెబుతారు.

 

Related posts