telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

యువతకు చుక్కలు చూపిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ…

రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోని కంటెస్టెంట్ దివి అనూహ్యమై గుర్తింపు పొందింది. అమె అందంతో పాటు ఫిజిక్ కూడా కుర్రకారుకి పిచ్చెక్కిస్తోంది. ఈ అమ్మడు అందాలకు ఎందరో దాసోహం అన్నారని చెప్పడంలో సందేహం అక్కర్లేదు. అయితే షో సగంలోనే ఎలిమినేట్ అయిన దివి షో తరువాత సినిమా ఆఫర్లను దక్కించుకుంది. హీరోయిన్‌గా అవకాశాల కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు కానీ దివి విషయంలో మాత్రం అవకాశాలు ఆమె కోసం వేచిఉన్నాయి. అయితే ఈ అమ్మడు ముంబై ముద్దుగుమ్మలకు ఏమాత్రం తీసి పోకుండా తన అందాలను ఆరబోస్తోంది. తన సోషల్ మీడియాలో ఎంతగానో యాక్టివ్‌గా ఉంటూ. ఎప్పటికప్పుడు కొత్తకొత్త ఫోటోలను షేర్ చేస్తోంది. ఈ సారి షేర్ చేసిన ఫోటోకు ప్రత్యేక ఫాన్ బేస్ వచ్చిందంటే నమ్మగలరా. ఆ ఫోటోలో ఆమె అందాలకు అందరూ లొంగిపోయారు. ఈ ఒక్క ఫోటోతో తాను ముంబై గుమ్మలకు ఏ మాత్రం తీసిపోనని నిరూపించింది. దాంతో ఈమె అభిమానులు అమ్మడుకి స్టార్ హీరోల సరసన ఆఫర్లు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతానికి దివి చిన్న సినిమాలలో అవకాశాలు సంపాదిస్తోంది. మరి ఈ అందాల ఆరబోతతో పెద్ద సినిమాలలో ఆఫర్లు అందుకుంటుందేమో చూడాలి.

Related posts