telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలీవుడ్ నటుడికి అండర్ వరల్డ్ డాన్ బెదిరింపు కాల్…!

Mahesh

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు మహేష్ మంజ్రేకర్ కు అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం పేరిట ఒక బెదిరింపు కాల్ వచ్చింది. తనకు రూ.35 కోట్లు ఇవ్వాలని బెదిరించాడు ఆ ఫోన్ చేసిన వ్యక్తి. దీంతో మహేష్ మంజ్రేకర్ ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తనకు వచ్చిన ఫోన్ కాల్ గురించిన వివరాలను పోలీసులకు వెల్లడించారు. మంజ్రేకర్ నుండి ఫిర్యాదు అందుకున్న ముంబై పోలీసులు డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ఆ నిందితుడిని అరెస్టు చేసారు. అయితే మహేష్ మంజ్రేకర్ కేవలం బాలీవుడ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించాడు. 2007లో గోపిచంద్ హీరోగా వచ్చి సూపర్ హిట్ మూవీ ‘ఒక్కడున్నాడు’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు మహేష్. తెలుగులో చివరగా ఆయన అఖిల్ అక్కినేని హీరోగా పరిచయమైన ‘అఖిల్’ సినిమాలో నటించారు.

Related posts