telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను నేను నిరూపించుకునే వరకు ఈ విమర్శలు వస్తూనే ఉంటాయి… జాన్వి కపూర్

Jahnavi-Kapoor

ప్రతిభ ఉన్న వాళ్లకు కాకుండా స్టార్‌ల వారసులకు, బంధువులకు మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయని ఇటీవలి కాలంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. `కాఫీ విత్ కరణ్` కార్యక్రమానికి హాజరైన హీరోయిన్ కంగనా రనౌత్ తొలిసారి బంధుప్రీతి గురించి విమర్శలు చేసింది. ఆలియా, జాన్వి, సారా, సొనాక్షి.. స్టార్ వారసురాళ్ల లిస్ట్ బాలీవుడ్‌లో పెద్దదే ఉంది. అతిలోక సుందరి శ్రీదేవి నటవారసులిగా `ధడక్` సినిమాతో తెరంగేట్రం చేసిన జాన్వీ కపూర్‌ కూడా బంధుప్రీతి కారణంగానే సులభంగా అవకాశం దక్కించుకుందని పలువురు విమర్శలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన జాన్వి బంధుప్రీతి గురించి స్పందించింది. `ఒక్క అవకాశం కోసం ప్రాణం ఇచ్చేవారు ఎంతో మంది ఉన్నారని నాకు తెలుసు. బంధుప్రీతి గురించి వారి మనోభావాలను నేను అర్థం చేసుకోగలను. కానీ, ఆ విమర్శల గురించి ఆలోచిస్తూ కుంగిపోను. నన్ను నేను నిరూపించుకునే వరకు ఈ విమర్శలు వస్తూనే ఉంటాయ`ని జాన్వి చెప్పింది

Related posts