నటరత్న ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం వి.జి.డి. ప్రొడక్షన్స్ “భలే మాస్టారు” సినిమా
27-03-1969 విడుదలయ్యింది.
నిర్మాత సి.ఎస్.రాజు హిందీ చిత్రం ప్రొఫెసర్ (1962) ఆధారంగా వి.జి.డి. ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు యస్.డి.లాల్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి మాటలు: భమిడిపాటి రాధాకృష్ణ, పాటలు: సి.నారాయణ రెడ్డి, కొసరాజు,ఆరుద్ర, దాశరధి, సంగీతం: టి.వి.రాజు, ఫోటోగ్రఫీ: కె.ఎస్. ప్రసాద్, కళ: తోట, నృత్యం: తంగప్ప, పసుమర్తి, కూర్పు: బి.గోపాలరావు అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, కాంచన, అంజలీదేవి, కృష్ణంరాజు, శాంతకుమారి, షీలా, రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ, విజయశ్రీ, ప్రభాకర రెడ్డి, మిక్కిలినేని తదితరులు నటించారు.
ప్రముఖ సంగీత దర్శకులు టి.వి.రాజు గారి సంగీత సారధ్యంలో వెలువడిన పాటలు
“ఆదిగో చిన్నది సొగసు చాలాఉన్నది.”
” నీవు నేనై నేను నీవే”,
” నీ బుగ్గల్లో గులాబీరంగు నాదే”
వంటి పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రం యావరేజ్ గా నడిచింది.
అనసూయ గుండె బద్ధలైందట… ఎందుకంటే..?