telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఇకనుంచి మన ప్రేమకు వారధి సారధి’… అనసూయపై ఆది హైపర్ పంచ్

Anasuya-bharadwaj tollywood

ఇంతకుముందు బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు మరో జబర్దస్త్ జంట అనసూయ, హైపర్ ఆదిలు. గత కొంతకాలంగా ఈ ఇద్దరి మధ్య ‘జబర్దస్త్’ స్కిట్‌లలో రొమాంటిక్ లవ్ ట్రాక్ నడిపిస్తున్నారు. పలు సందర్భాల్లో ఆది.. అనసూయ వెంటపడటం, అనసూయ తెగ సిగ్గుపడిపోతూ ఆదిని ఓ రేంజ్‌లో ఎంకరేజ్ చేస్తూ ఉండటం షరా మామూలుగానే కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య రొమాంటిక్ ట్రాక్‌‌ జబర్దస్త్‌లోనే కాదు.. అనసూయ హోస్ట్ చేస్తున్న ప్రతిరోజు పండగే షోకి కూడా షిప్ట్ చేశారు. సెలబ్రిటీస్‌కి కామన్ ఉమెన్స్‌కి పోటీ అంటూ అనసూయ యాంకరింగ్ చేస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ షోకి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. ఇందులోనూ గులాబీ పువ్వు పట్టుకుని మరీ అనసూయ వెంటపడుతున్నాడు హైపర్ ఆది. ‘హాయ్.. ఆది!! నువ్ ఏంటి ఇక్కడ అని అనసూయ తెగ సిగ్గుపడిపోతూ అడగ్గా.. ‘నువ్విక్కడుండీ.. నేను అక్కడ ఉంటే ప్రాణం విలవిలా’ అంటూ పువ్వు ఇచ్చి మరీ పాట అందుకున్నారు ఆది. ‘ఇది జబర్దస్త్ కాదు.. సారధి స్టుడియో’ అని అనసూయ చెప్పగా.. ‘అంటే.. ఇకనుంచి మన ప్రేమకు వారధి సారధి’ అంటూ పంచ్ పేల్చారు హైపర్ ఆది. ఆడవాళ్ల షోలో నీకేం పని అని కంటెస్టెంట్ ఒకరు అడగ్గా.. ‘మీ ఆట మీరు ఆడుకోండి.. నేను అనసూయ మనసు దోచుకోవడానికి వచ్చా’ అంటూ మరో హైపర్ పంచ్ వేశారు. సోమవారం నుండి శనివారం వరకూ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కానున్న ఈ షో ఈటీవీలో త్వరలో ప్రారంభం కానుంది.

Related posts