telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇస్మార్ట్ శంకర్” హిందీ రీమేక్… హీరో ఎవరంటే…?

Ismart Shankar

పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్” చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రంలో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్‌గా నటించిన సంగతి తెలిసిందే. గతేడాది విడుదలై ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో ‘ఇస్మార్ట్ శంకర్’ ముందు వరుసలో ఉంది. రామ్ కెరీర్‌లో కూడా తొలిసారి రూ.40 కోట్ల షేర్‌ ఈ చిత్రంతో అందుకున్నాడు. ఎన్టీఆర్‌తో చేసిన “టెంపర్” తర్వాత సరైన సక్సెస్ లేని పూరీ జగన్నాథ్‌కు ఈ చిత్రం నిర్మాతగా, దర్శకుడిగా మంచి లాభాలని తీసుకొచ్చింది. మణిశర్మ అందించిన మ్యూజిక్ కు, డైలాగ్స్ కు థియేటర్లలో విజిల్స్, గోలల… మొత్తానికి ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవ్వనుంది. వరుసగా అక్కడ తెలుగు సినిమాలు రిమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే ఈ సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ సినిమాలో హీరోగా రణ్ వీర్ సింగ్ నటించబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి. ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన పూరీనే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేయనున్నారని సమాచారం. దీనిపైన త్వరలో అధికార ప్రకటన రానుంది. ఇక పూరి, విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని చార్మీ, పూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.

Related posts