బుల్లితెర రియాలిటీ షో బిగ్‌బాస్ 3 నుండి గత వారం మహేశ్ విట్టా ఎలిమినేట్ అయ్యాడు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లో బాబాభాస్కర్, వరుణ్ సందేశ్, వితిక, రాహుల్, అలీ రెజా, శివ జ్యోతి, శ్రీముఖి ఉన్నారు. అయితే ఈ వారం అందరూ ఎలిమినేషన్ లో ఉండడం విశేషం. మరి వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గత ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ఇంటి సభ్యులకి బిగ్ బాస్ హోటల్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ టాస్క్‌లో ఇంటి సభ్యులతో ఫన్నీ టాస్క్ లు చేయంచారు. ఫ్రీజ్, స్లీప్, మూవ్, ఫార్వర్డ్ ఇలా బిగ్ బాస్ ఆదేశాల ప్రకారం ఇంటి సభ్యులు నడుచుకోవలసి ఉంటుంది. టాస్క్ జరుగుతున్న క్రమంలో ఒక్కో హౌజ్‌మేట్‌కి చెందిన కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటారు. 87వ ఎపిసోడ్‌లో వితికా సోదరి రితికా, అలీ భార్య మసుమ ఇంట్లోకి ప్రవేశించారు. 88వ ఎపిసోడ్‌లోను హోటల్ టాస్క్ కొనసాగగా, స్లీప్ మోడ్‌లో ఉన్నప్పుడు ఇంట్లోకి ప్రవేశించిన అలీ భార్య మసుమ తన భర్తని కౌగిలిలో బంధించేసింది. నిన్ను చాలా మిస్ అవుతున్నానంటూ ముద్దులు కూడా ఇచ్చింది. మిగతా ఇంటి సభ్యులని ఒక్కొక్కరిగా పలకరిస్తూ అందరికి శుభాకాంక్షలు తెలియజేసింది. మసుమ వెళ్లిన తర్వాత శివజ్యోతి భర్త గంగూలీ ఇంట్లోకి ప్రవేశించాడు. ఆయనని చూసి శివజ్యోతి గుక్కపెట్టి ఏడుస్తుండడంతో, నువ్వు ఇలానే ఏడిస్తే నేను వెళ్లిపోతానంటూ హెచ్చరిస్తాడు.
తన భర్తని చాలా రోజుల తర్వాత చూసిన శివజ్యోతి ఆనందానికి అవధులు లేవు. కొద్ది సేపు ఆయనతో ముచ్చటించి ఆ తర్వాత తమకి స్టార్ రేటింగ్ ఇవ్వాలని కోరింది. హౌజ్‌మేట్స్ ఆతిథ్యానికి మెచ్చిన గంగూలీ వన్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఇక గంగూలీ తర్వాత ఇంట్లోకి బాబా భాస్కర్ కుటుంబ సభ్యులు ప్రవేశించారు. ఇద్దరు పిల్లలు అర్జున్, లక్ష్య కన్ఫెషన్ రూం నుండి ఇంట్లోకి రాగా, బాబా భార్య రేవతి మెయిన్ డోర్ నుండి వచ్చింది. ఫ్యామిలీని చూసిన బాబా భాస్కర్ చాలా ఎమోషనల్ అయ్యారు. గేమ్ బాగా ఆడుతున్నారు. ఎమోషనల్ కావొద్దు అని భర్తకి హితవు పలికింది రేవతి. ఈ రోజు కూడా మిగతా ఇంటి సభ్యుల కుటుంబ సభ్యులు ఇంట్లోకి ప్రవేశించనున్నారు. వారి వాళ్ళని చూసి మిగతా వారు ఎంత ఎమోషనల్ అవుతారో చూడాలి. ఇంటి సభ్యులకి సంబంధించిన కుటుంబ సభ్యులు హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌజ్ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హౌజ్‌మేట్స్ అందరు ఫుల్ ఎమోషనల్ అయ్యారు. దాదాపు ఎనభై రోజులకి పైగా కుటుంబ సభ్యులకి దూరంగా ఉండడంతో తమ ప్రేమని ముద్దు, ముచ్చట, హగ్ రూపంలో చూపించారు. కెమెరాలు ఉన్న విషయాలని కూడా మరచిపోయి ముద్దులలో మునిగారు. కొట్లాటలు, అల్లర్లు, పోటీలతో సాగుతున్న బిగ్ బాస్ హౌజ్ ఒక్కసారిగా ప్రేమతో నిండిపోయింది.