సైరా ఫేమ్ సురేంద్ర రెడ్డి తన వ్యక్తిగత జీవితం గురించి అదేవిధంగా తన అభిరుచుల గురించి అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేశాడు. మొదటి నుంచి తాను ఎదుటి మనిషిని కాకాపడుతూ తిరగడం తనకు అలవాటు లేదనీ అందువల్ల తనకు దర్శకుడుగా అవకాశాలు రావడం చాల కష్టమైంది అన్న విషయాలను వివరించాడు. అలాంటి పరిస్థితులలో తనను నమ్మి తనకు మొదటి అవకాశం ఇచ్చి ‘అతనొక్కడే’ మూవీ ద్వారా ప్రోత్సహించిన కళ్యాణ్ లేకుంటే ఫిలిం ఇండస్ట్రీలో సురేంద్ర రెడ్డి అనే వ్యక్తి ఉండడని అందువల్ల తాను జీవితాంతం కళ్యాణ్ రామ్ కు రుణపడి ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
కళ్యాణ్ రామ్ కు ‘కిక్ 2’ లాంటి భారీ ఫెయిల్యూర్ తను ఇచ్చినా తనను ఒక్క మాట అనలేదని కళ్యాణ్ రామ్ లాంటి మంచి వ్యక్తులు చాల తక్కువమంది ఇండస్ట్రీలో కనిపిస్తారు అంటూ సురేంద్ర రెడ్డి తన అభిప్రాయాన్ని షేర్ చేస్కున్నాడు. దీనితో కళ్యాణ్ రామ్ లేకుంటే తాను దర్శకుడుగా మారలేను కాబట్టి తనకు ‘సైరా’ లాంటి భారీ సినిమా తీసే అవకాశం ఎక్కడ వస్తుంది అంటూ పరోక్షంగా ‘సైరా’ లాంటి భారీ సినిమా తీయడానికి గల కారణం కళ్యాణ్ రామ్ అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. చిన్నతనంలో శ్రీదేవి సినిమా చూడటం కోసం తన ఊరు నుండి వరంగల్ కు 40 కిలో మీటర్లు సైకిల్ పై వెళ్ళిన తన అభిమానాన్ని బయటపెడుతూ ఇప్పుడు కలవాలి అని ఉన్నా తాను కలవలేను అంటూ తన బాధను వ్యక్త పరిచారు.