telugu navyamedia
సినిమా వార్తలు

డియర్ కామ్రేడ్ : “గిర గిర” లిరికల్ వీడియో సాంగ్

Dear-Comred

సెన్సేష‌న‌ల్  హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్‌  బ్యాన‌ర్స్‌లో రూపొందుతున్న ఎమోష‌న‌ల్ డ్రామా “డియ‌ర్ కామ్రేడ్‌”. “యు ఫైట్ ఫ‌ర్ వాట్ యు ల‌వ్‌” ట్యాగ్ లైన్‌. ఈ  సినిమా టీజ‌ర్‌ను ఈ నెల 17న నాలుగు ద‌క్షిణాది భాషలైన తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంది. సామాజిక బాధ్య‌త ఉన్న ఇన్‌టెన్సివ్ పాత్ర‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ మెప్పించ‌నున్నారు. ఈ చిత్రానికి జ‌స్టిన్ ప్ర‌భాక‌రన్‌ సంగీతం అందిస్తుండ‌గా, సుజిత్ సారంగ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి “గిర గిర గిర” అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుద‌ల చేశారు చిత్రబృందం. రెహ‌మాన్ లిరిక్స్ అందించ‌గా, గౌత‌మ్ భ‌ర‌ద్వాజ్‌, యామిని ఘంట‌సాల పాట‌ని ఆల‌పించారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర్ స్వరాలు అందించారు. పెళ్ళి నేపథ్యంలో సాగే ఈ పాట యూత్ ను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రెండు పాటలు విడుదల కాగా వారికి మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు విడుదలైన మూడో పాట కూడా దేవరకొండ అభిమానులను అలరిస్తోంది. మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను చూసేయండి మరి.

Related posts