telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీఎం కేసీఆర్‌పై సెటైర్‌ వేసిన కేంద్రమంత్రి..

Kishan Reddy

సీఎం కేసీఆర్‌ నిన్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోడీకి వేర్వేరుగా లేఖలు రాసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కోరారు. హిందీ, ఆంగ్ల భాషల్లోనే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర అభ్యర్థులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులకు సమాన అవకాశాలు ఇచ్చే విధంగా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాల్సిన ఆవశ్యకతను కేసీఆర్‌ వివరించారు. జాతీయ స్థాయి ఉద్యోగ నియామకాల పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని కోరుతూ… సీఎం కేసీఆర్ లేఖ రాయడాన్ని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తప్పుబట్టారు. సీఎం కేసీఆర్‌ లేఖపై ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఉద్యోగ నియామకాల కోసం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వ ఏర్పాటు చేసిందని.. 12 ప్రాంతీయ భాషల్లో నియామక పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి NRA CET విషయం తెలిసినట్టు లేదని ఎద్దేవా చేశారు.

Related posts