నిఖిల్ సిద్ధార్థ్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన సినిమా కార్తికేయ 2 . ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం థియేటర్స్ వద్ద తన సత్తా ను కొనసాగిస్తోంది.
చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ ఆధ్యాత్మిక థ్రిల్లర్ ఉత్తర భారతదేశంలో కూడా సంచలన విజయం సాధించింది. టాలీవుడ్ టు బాలీవుడ్ అన్ని చోట్లా బాక్సాఫీస్ ముందు అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకెళ్తోంది. నార్త్‌లో అయితే ఏకంగా అగ్ర కథానాయకులైన ఆమిర్ ఖాన్ లాల్‌సింగ్ చడ్డా, అక్షయ్‌కుమార్ రక్షాబంధన్ సినిమాలను సైతం పక్కకు నెట్టి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తోంది.
తాజాగా కార్తికేయ మూవీటీమ్పై బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చ్ను ప్రశంసలు కురిపించారు. స్వయంగా చందూ మొండేటిని ప్రత్యేకంగా ఆహ్వానించి అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చందూ.. అమితాబ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ ఫోటోలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌కి చందూ మొండేటి నమస్కారం చేస్తున్నారు. “ఆ దీవెనలు!! ధన్యవాదాలు అమితాబ్ బచ్చన్ జీ, లైఫ్ టైమ్ మెమరీస్ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. .దీనికి సంబంధించిన ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, హర్ష చెముడు మరియు శ్రీనివాస రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాల పై నిర్మించడం జరిగింది. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించారు.
మగవారిని అడ్డం పెట్టుకొని ఆడుతుంది సిరి..?